Breaking News
Home / States / సీఎం హోదాలో ప్రధానిని కలవటం తప్పులేదు..

సీఎం హోదాలో ప్రధానిని కలవటం తప్పులేదు..

హైదరాబాద్: సీఎం హోదాలో కేసీఆర్ ప్రధానిని కలవటంలో తప్పు లేదని బీజేపీ నేత లక్ష్మణ్‌ అన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్ళకుండా కేసీఆర్‌ మొహం చాటేశారని విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటోందని ధ్వజమెత్తారు. ప్రాజక్టుల పేరుతో ఇద్దరు సీఎంలు కమీషన్లు దండుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు. జగన్‌తో కేసీఆర్ కొత్త బంధాలు ఏర్పాటు చేసుకున్నారని, నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలని లక్ష్మణ్‌ డిమాండ్ చేశారు. ఏపీలో మాదిరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆర్టీసీ సమస్యలపై కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. ఆర్టీసీని ప్రభుత్వమే నష్టాల ఊబిలోకి నెట్టిందని లక్ష్మణ్‌ మండిపడ్డారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *