Breaking News
Home / National / ఎస్‌సీవో సమ్మిట్: ఇమ్రాన్ ముందే కుండబద్దలు కొట్టిన మోదీ!

ఎస్‌సీవో సమ్మిట్: ఇమ్రాన్ ముందే కుండబద్దలు కొట్టిన మోదీ!

బిష్కేక్: తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపాలన్న భారత వైఖరిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి పునరుద్ఘాటించారు. తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దేశాల నిలువరించాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు. కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కేక్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సమ్మేళనంలో సభ్యదేశాలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఎస్‌సీవో స్ఫూర్తి, ఆదర్శాలు మరింత బలాన్ని ఇస్తాయని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చూస్తుండగానే, ఆయన సమక్షంలోనే మోదీ ఈ మేరకు వ్యాఖ్యానించడం విశేషం. భారత్‌ను ఎదుర్కునేందుకు ఓ దేశం గత కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచిపోషించడమే తన విధానంగా చేసుకుందంటూ పాకిస్తాన్‌ను ఉద్దేశించి ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. ఉగ్రవాదం పీడ వదిలించేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా ముందుకొచ్చి పోరాడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

ఇటీవల తాను శ్రీలంక వెళ్లాననీ.. ఏప్రిల్ 21న కొలంబో చర్చిలో బాంబు దాడుల కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాన్ని చూసి వచ్చానని మోదీ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి నెలకొనాలని మోదీ ఆకాంక్షించారు. గత నాలుగు దశాబ్దాలుగా ఉగ్రవాదం, తిరుగుబాటుతో ధ్వంసమైన ఆ దేశం అభివృద్ధి చెందడం చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. కాగా ఎస్‌సీవో సమ్మిట్‌ సందర్భంగా ఇవాళ ప్రధాని మోదీ ఇరాన్ అధ్యక్షుడు హాసన్ రౌహానీతో సమావేశం కానున్నారు. పర్షియన్ గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ భేటీపై విశేష ఆసక్తి నెలకొంది.

Check Also

నేడు న్యూఢిల్లీలో లోక్ సభ నూతన సభాపతి నియామకం

Share this on WhatsAppన్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్న నేపథ్యంలో బీజేపీ ఇవాళ నూతన సభాపతి నియామకం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *