Breaking News
Home / National / సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌…

సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌…

ఢిల్లీ: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా వ్యాపిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మహారాష్ట్ర, కేరళ, యూపీ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పంజాబ్‌, హర్యానా, గుజరాత్‌, సిక్కిం, మిజోరాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాతం పుదుచ్చేరికి చెందిన ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… మార్చి 1న అమెరికాలో 75 కేసులు నమోదు కాగా.. నేటికి ఆ సంఖ్య 14వేలకు చేరిందని చెప్పారు. ఎండ తీవ్రతకు కరోనా వైరస్‌ వ్యాపించదనడంపై ఆలోచించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సౌదీ అరేబియాలో ఎండలు తీవ్రంగా ఉన్నా వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తోందని మోదీ గుర్తుచేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌తో పాటు ఇరు రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఈటల రాజేందర్‌, ఆళ్ల నాని వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కరోనా నివారణకు రాష్ట్రాల్లో చేపట్టిన చర్యలను ప్రధాని ఆరాతీశారు.

Check Also

జూలై 31 వరకు లాక్‌డౌన్

Share this on WhatsAppదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒడిశాలో కరోనా కరళా నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *