Breaking News
Home / Lifestyle / Business / ప్రైవేటు కంపెనీలకు ఊరట : సుప్రీం కీలక తీర్పు

ప్రైవేటు కంపెనీలకు ఊరట : సుప్రీం కీలక తీర్పు

సుప్రీంకోర్టు ఇవాళ ఓ కీలక తీర్పునిచ్చింది. ప్రైవేటు కంపెనీలకు భారీ ఊరటనిచ్చింది. ఉద్యోగస్తులకు జీతాలు చెల్లించలేకపోతున్న ప్రైవేటు కంపెనీలపై ఎటువంటి చర్యలకు ఆదేశించడం లేదని సుప్రీంకోర్టు పేర్కొన్నది. జూలై చివర వరకు ప్రైవేటు సంస్థలకు ఈ వెసలుబాటు కల్పించనున్నట్లు కోర్టు వెల్లడించింది. ప్రైవేటు సంస్థలు, ఉద్యోగస్థులతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు నిర్వహించి.. సమస్యలను పరిష్కరించుకోవాలని కోర్టు తన ఆదేశంలో పేర్కొన్నది. కోవిడ్‌19తో ఏర్పడిన లాక్‌డౌన్‌ సమయంలో ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించాలని, వారికి కోతలు విధంచకూడదు అంటూ మార్చి నెలలో కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై వివాదం సరికాదు అని, పరిశ్రమలు, కార్మికులకు ఒకరికొకరు అవసరమని, 50 రోజుల జీతాలకు సంబంధించి వివాదాన్ని పరిష్కరించాలని అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో పేర్కొన్నది. జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, సంజయ్‌ కిషణ్‌ కౌల్‌, ఎంఆర్‌ షాలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో విచారణ జరిపింది.

Check Also

చైనాకు షాక్ ఇచ్చిన ఆపిల్, 4,500 యాప్స్ తొలగింపు

Share this on WhatsAppసరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన 59 చైనీస్ యాప్స్‌ను ఇండియా నిషేధించిన విషయం తెలిసిందే…తాజాగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *