Breaking News
Home / Film News / పెళ్లి పనులు మొదలు…

పెళ్లి పనులు మొదలు…

దీపికా పదుకోన్‌ వివాహ వేడుక ముగిసింది. మరో కథానాయిక వివాహానికి హిందీ చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. డిసెంబర్‌ 2న రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో ప్రియాంకా చోప్రా, నిక్‌ జోనాస్‌ వివాహం జరగనుంది. పెళ్లి పనులను స్వయంగా పర్యవేక్షించడానికి గురువారం ప్రియాంక తల్లి మధు చోప్రా జోధ్‌పూర్‌ వెళ్లారు. పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయో చూసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో హిందీ చిత్రీకరణలో పాల్గొంటున్న ప్రియాంక కూడా త్వరలో జోధ్‌పూర్‌ వెళతారట! నవంబర్‌ 29 నుంచి పెళ్లి సంబరాలు మొదలు కానున్నాయి. మొదట సంగీత్‌, తర్వాత మెహందీ ఫంక్షన్‌, ఆ తర్వాత పెళ్లి కూతురిని చేయడం వంటివి ప్లాన్‌ చేశారని సమాచారం. రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకోన్‌ తమ పెళ్లికి పరిమిత సంఖ్యలో అతిథులను ఆహ్వానించారు. ప్రియాంక తన పెళ్లికి హిందీ చిత్ర పరిశ్రమ నుంచి ఎక్కువ సంఖ్యలో అతిథులను ఆహ్వానించే అవకాశాలున్నాయని ముంబయ్‌ వర్గాల సమాచారం.

దీప్‌వీర్‌ హనీమూన్‌ ఎక్కడ?
ప్రియాంక పెళ్లి సంగతులు పక్కన పెడితే… రణ్‌వీర్‌, దీపిక దంపతులు హనీమూన్‌కి ఎక్కడికి వెళతారనే చర్చ మొదలైంది. రణ్‌వీర్‌ సింగ్‌ స్విట్జర్లాండ్‌ పర్యాటకానికి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు కనుక స్విస్‌ వెళతారని కొందరు, లేదు పారిస్‌, ఫ్రెంచ్‌రివేరా, బొరాబొరా, ఫిజి ఐలాండ్స్‌లో ఎక్కడికో చోటుకు వెళ్లవచ్చిని పలువురు సోషల్‌ మీడియాలో చర్చకు తెర తీశారు. ఈ నెల 18న ముంబయ్‌ చేరుకోనున్న ఈ కొత్త జంట… 21న బెంగళూరులో కుటుంబ సభ్యులు, సన్నిహితుల కోసం రిసెప్షన్‌, డిసెంబర్‌ 1న ముంబయ్‌లో హిందీ సినిమా ప్రముఖుల కోసం ప్రత్యేక విందు ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నారు.

Check Also

రాళ్లపల్లికి….చిరంజీవీ ప్రగాఢ సంతాపం

Share this on WhatsAppప్ర‌ముఖ న‌టుడు రాళ్లపల్లి(73) అనారోగ్యంతో చికిత్స పొందుతూ శుక్ర‌వారం సాయంత్రం హైద‌రాబాద్‌లోని మ్యాక్స్ క్యూర్ హాస్పిట‌ల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *