Breaking News
Home / States / Andhra Pradesh / అంతర్జాతీయ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నీ విజేత ప్రియాంక

అంతర్జాతీయ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నీ విజేత ప్రియాంక

విజయవాడ: అంతర్జాతీయ ఆన్‌లైన్‌ చెస్‌ టోర్నీలో విజయవాడకు చెందిన మహిళా అంతర్జాతీయ మాస్టర్‌ (డబ్ల్యుఐఎం) నూతక్కి ప్రియాంక విజేతగా నిలిచింది. యూఎస్‌ఏలోని సుసాన్‌ పోల్గర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి రెండు రోజుల పాటు నిర్వహించిన ఆన్‌లైన్‌ అండర్‌-20 ఓపెన్‌ చెస్‌ టోర్నీలో పలు దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. తొలిరోజు జరిగిన ఏడు రౌండ్లకు గాను ప్రియాంక 6.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన క్రీడాకారుల మధ్య రెండో రోజు ఆదివారం నిర్వహించిన ‘ప్లే ఆఫ్‌’ తొలి గేమ్‌లో బల్గేరియాకు చెందిన ఫిడే మాస్టర్‌పై ప్రియాంక గెలిచింది. రెండో గేమ్‌లో ఆర్మేనియాకు చెందిన ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ (ఐఎం)తో ‘డ్రా’ చేసుకోవడంతో డిసైడింగ్‌ గేమ్‌ అనివార్యమైంది. ఈ గేమ్‌లో ప్రియాంక విజయం సాధించింది. టోర్నీ విజేతగా నిలవడంతో 60 వేల డాలర్ల ఉపకార వేతనాన్ని అందుకోనుంది. దీంతో పాటు యూఎస్‌ఏలో జరిగే ‘స్పైస్‌ కప్‌-2020’కి అయ్యే ఖర్చులను ఫౌండేషన్‌ భరిస్తుంది.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *