గుంటూరు : తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ.. భట్టిప్రోలు తహశీల్దార్ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికులు సోమవారం ఉదయం భారీ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో 200 మందికిపైగా భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. సిఐటియు నాయకులు జి.సుధాకర్, కృష్ణమోహన్, తదితరులు ప్రసంగిస్తున్నారు.
