Breaking News
Home / States / Andhra Pradesh / సీఎం సొంత జిల్లాలోనే కార్మికులకు ఇబ్బందులు….

సీఎం సొంత జిల్లాలోనే కార్మికులకు ఇబ్బందులు….

కడప: నగరంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎదుట పారిశుధ్య కార్మికులు మంగళవారం ధర్నా చేపట్టారు. కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్న పారిశుధ్య కార్మికులు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పర్మినెంట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. జీతాలు రాక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. పెండింగ్‌లో ఉన్న జీతాలను ఇస్తామని సీఎం జగన్‌ ప్రకటించారని, సీఎం సొంత జిల్లాలోని పారిశుధ్య కార్మికులు ఇబ్బంది పడుతుంటే కనీసం ఒక్క అధికారి కూడా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్‌ అధికారులు తమ సమస్యల్ని పరిష్కరించకపోతే సమ్మె చేపడతామని హెచ్చరించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *