Breaking News
Home / States / Andhra Pradesh / అనుమతులు లేకుండానే పాలిస్టైరిన్‌ ఉత్పత్తి

అనుమతులు లేకుండానే పాలిస్టైరిన్‌ ఉత్పత్తి

అనుమతులు లేకుండానే పాలిస్టైరిన్‌ ఉత్పత్తి
తప్పు చేశామని 2019 మేలోనే అఫిడవిట్‌
అప్పుడే ఎల్జీ పాలిమర్స్‌ను మూసేయాల్సింది
కీలుబొమ్మగా మారిన కాలుష్య నియంత్రణ మండలి
ఎన్‌జీటీ ముందు నోరువిప్పిన ఎన్‌జీవోలు
విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ వ్యవహార తీరు తొలి నుంచీ అడ్డగోలుగానే ఉందని పలువురు నిపుణులు విమర్శించారు. ఈ ప్రమాద ఘటనపై విచారణ కోసం విశాఖపట్నం వచ్చిన ‘నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ)’ మంగళవారం ఆయా రంగాల్లో పనిచేస్తున్న నిపుణులు, సంస్థల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ‘సంస్థ ఏర్పాటైన నాటి (1997) నుంచి ఎటువంటి అనుమతులూ లేకుండానే పాలిస్టైరిన్‌ ఉత్పత్తి చేస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ కంపెనీయే ఒప్పుకొంది. గత ఏడాది… అంటే 2019 మే 10వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి ఓ అఫిడవిట్‌ సమర్పించింది.

ఈ విదేశీ కంపెనీకి నాటి నంచి నేటి వరకూ అటు కేంద్రం, ఇటు రాష్ట్రం రెండూ సహకరిస్తూ వచ్చాయి. అఫిడవిట్‌ సమర్పించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అద్భుతమైన అవకాశం లభించింది. అదే అదనుగా కంపెనీని మూసేయవచ్చు. కానీ ఆ పని చేయలేదు. కొనసాగింపునకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దానికి ప్రతిఫలంగా ఇప్పుడు 12 మంది ప్రాణాలు పోయాయి’ అంటూ స్వచ్ఛంద సంస్థలు ఆవేదన వ్యక్తం చేశాయి. దీనికి హాజరైన కొందరు, హాజరుకాలేకపోయిన మరికొందరు కూడా తమ సూచనలు అందించారు.

Check Also

వాయుగుండం ప్రభావంతో చురుగ్గా నైరుతి

Share this on WhatsAppఅమరావతి:  పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో బలపడిన అల్పపీడానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది మరింత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *