Breaking News
Home / States / సీఎంకు ప్రొఫెసర్ నాగేశ్వర్ సవాల్…

సీఎంకు ప్రొఫెసర్ నాగేశ్వర్ సవాల్…

హైదరాబాద్: కార్మికుల జీతాలు పెరిగినందువల్లే తెలంగాణ ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటన పచ్చి అబద్ధమని ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకులు నాగేశ్వర్ చెప్పుకొచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈరోజుతో ఆర్టీసీ సమ్మె 13వ రోజుకు చేరినా.. కోర్టు చర్చలు జరపమని చెప్పినా ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడమేంటి..? అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ బస్ సగటు వేగం 15కి.మీ. ఇందుకు కారణం ట్రాఫిక్, రోడ్లు బాగాలేకపోవడమే అని ఆయన చెప్పుకొచ్చారు.

సర్కార్‌కు సవాల్.. నేను రెడీ! ‘ ఇప్పటికి తెలంగాణాలో 1400గ్రామాలకు బస్సులు లేవు. ఆర్టీసీకి ఏటా 700 కోట్లు నష్టం వస్తుంది. లక్ష 60వేల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణా ప్రభుత్వం కోటి మందికి సేవచేసే ఆర్టీసీకి 700 కోట్లు ఇవ్వలేదా..?. ఎమ్మెల్యేల జీతాలపైన టాక్స్ ఉండదు కానీ ఆర్టీసీపైన టాక్స్ ఎందుకు..?. అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ప్రభుత్వ విధానాల వల్ల రోజుకి ఆర్టీసీ రూ. 80లక్షల వడ్డీ కడుతోంది. కేసీఆర్ సర్కార్‌కు నేను సవాల్ చేస్తున్నా.. ఇప్పుడు నేను చెప్పిన లెక్కలు అన్ని వాస్తవాలు. ఎక్కడ చర్చకు రావడానికి అయినా నేను సిద్ధం. ప్రభుత్వంకు చేతకాక పోతే మాకు అప్పచెప్పండి. ఆర్టీసీని వేల కోట్ల లాభాల్లోకి తీసుకెళ్తాం ‘ అని నాగేశ్వర్ వ్యాఖ్యానించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *