Breaking News
Home / Health / శనగలతో లాభాలు

శనగలతో లాభాలు

మన దేశంలో పండే కాబూలీ శనగలలో ఎన్ని పోషకవిలువలు ఉన్నాయంటే ఫిట్నెస్ ఇష్టపడేవారికి సరైన ఆహారమని చెప్పుకోవచ్చు. 100 గ్రాముల ఉడికించిన శనగలలో 9 గ్రాముల ప్రొటీన్, 8 గ్రాముల ఆహార ఫైబర్ ఉంటుంది. యునైటడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నివేదికల ప్రకారం కొలెస్ట్రాల్ అసలు ఉండదు. అయితే, మాములుగా అయితే, 2.6గ్రాముల కొవ్వు మాత్రమే ఉంటుంది, ఐరన్, మెగ్నీషియంలు ఎక్కువగా ఉంటాయి. 164 కేలరీలతో ఈ శనగలతో చేసే వంటకం బానే కడుపు నింపుతుంది కూడా.
శనగలతో పోషణ

మధ్యధరా ప్రాంతపు డిప్ హుమ్ముస్ ని ఉడికించిన శనగలతో చేస్తారు. ఇది ఎంతగానో టేస్టీగా ఉంటుంది. అక్కడ ఇది ఫేమస్ అని చెప్పొచ్చు.

శనగలతో లాభాలు

బెంగాల్ గ్రామ్ లేదా ఈజిప్షియన్ పీస్ గా ప్రసిద్ధమైన శనగల లాభాలు ఇవిగో కొన్ని:

1. బరువు నియంత్రణ

ఎక్కువగా ప్రొటీన్, పీచుపదార్థం ఉండటం అంటే శనగలు బరువు తగ్గడానికి సరిపడే ఆహారమని అర్థం. ప్రొటీన్, పీచుపదార్థం రెండూ కడుపు నింపి, ఎక్కువసేపు ఆకలి లేకుండా చేసి, బరువు నియంత్రణలో సాయపడతాయి. కాబట్టి డైట్ చేసే వారు వీటిని ఎక్కువగా తీసుకోవచ్చని చెబుతారు. వీటిని ఎలా తిన్నా సరైన ప్రయోజనాలు ఉంటాయి.

2. మధుమేహం నియంత్రణ

శనగల్లోని పీచుపదార్థం రక్తంలోని చక్కెరస్థాయిని, కొవ్వుల స్థాయిని తగ్గించి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను కూడా మెరుగ్గా నియంత్రించటంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఎక్కువ పీచుపదార్థాలు ఉన్న ఆహారం వల్ల డయాబెటిస్,రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటం వంటి రిస్కులు తగ్గుతాయి. కాబట్టి డయాబెటీస్ వీటిని ఎక్కువగా తింటే చాలా మంచిది.

3. ఎముకల ఆరోగ్యం మెరుగుపరుస్తాయి

శనగలు ఎముకల ఆరోగ్యం కూడా మెరుగుపరుస్తాయి. ఎందుకంటే వీటిల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ అలాగే విటమిన్ కె వంటి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ అన్ని పోషకాలు శరీరంలో ఎముకలు బలంగా ఉండటానికి అవసరం. కాల్షియం లేమితో బాధపడేవారు శనగలను తినడం వల్ల ఫలితం ఉంటుంది.

4. గుండె ఆరోగ్యం పెంచుతాయి

2006లో ఆనల్స్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజంలో ప్రచురితమైన అధ్యయనంలో శనగలు తినటానికి, చెడు కొలెస్ట్రాల్ లేదా లో డెన్సిటీ లిపోప్రొటీన్ (ఎల్ డిఎల్) స్థాయి తగ్గటానికి మధ్య సంబంధం గురించి వివరించారు. ఎక్కువ కొలెస్ట్రాల్ బలహీనమైన గుండె ఆరోగ్యాన్ని సూచిస్తుంది కాబట్టి, శనగలు తినటం వలన గుండె ఆరోగ్యం మెరుగుపడవచ్చు. వీటిని తినడం వల్ల కొవ్వు శాతం పెరగదు కాబట్టి.. హాయిగా తినొచ్చు.

5. నాడీవ్యవస్థ, కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి

శనగల్లో ఉండే విటమిన్ బి9 లేదా ఫోలేట్ మెదడు, కండరాల సరైన అభివృద్ధికి అలాగే నాడీవ్యవస్థ చక్కగా పనిచేయటానికి, సరైన మెటబాలిజం వంటివాటికి ఉపయోగపడుతుంది. ఇది ఇంకా కాలేయంలోని కొవ్వు జీర్ణమవ్వటంలో సాయపడి కాలేయం బాగా పనిచేసేలా చేస్తుంది.

6. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది..

శనగలలో పీచుపదార్థం ఉండటం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల జీర్ణ సమస్యలు ఏవైనా సరే తగ్గిపోతాయని చెబుతున్నారు.

అందుకని ఒకవేళ మీ డైట్లో ఇప్పటికే శనగలు లేకపోతే, ఆరోగ్యకరమైన గుండె, మెదడు ఇంకా శరీరం కోసం శనగలను కూడా వంటకాలలో వాడుతూ తినడానికి ప్రయత్నించండి. వీటిని స్నాక్స్‌లా కూడా చక్కగా తినొచ్చు. తక్కువ ఖర్చుతోనే దొరికే ఇంత చక్కని ఆహారం వదిలి లేని పోని బయటి ఆహారాన్ని తిని ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకోవద్దు.

Check Also

ఘోర రోడ్డు ప్రమాదం; ఐదుగురి మృతి

Share this on WhatsAppభోపాల్‌ : మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్‌ జిల్లా పఠా రోడ్‌ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *