విజయవాడ: శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా శుక్రవారం నుంచి విజయవాడలో నిషేధాజ్ఞలు ప్రారంభమయ్యాయి. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ , మోట్రోపాలిటన్ ప్రాంత అదనపు జిల్లా మేజిస్ట్రేట్ శ్రీనివాసులు తెలిపారు.
ఆగస్టు 31వ తేదీ వరకు 46 రోజుల పాటు కమిషనరేట్ పరిధిలో 5గురు లేదా అంతకు మించి జనం ఒక దగ్గర ఉండరాదని పేర్కొన్నారు. రాళ్లు, కర్రలు, వంటివి పట్టుకుని సంచరించరాదని వివరించారు. ఈ నిబంధనలను పాటించని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు