Breaking News
Home / National / బంగారంపై ప్రమోషనల్ ఆఫర్లు.. మహిళలను ఊరిస్తున్న వ్యాపారులు!

బంగారంపై ప్రమోషనల్ ఆఫర్లు.. మహిళలను ఊరిస్తున్న వ్యాపారులు!

న్యూఢిల్లీ: బంగారం వినియోగంలో భారత్‌ది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం. పసిడి ధరకు ఇటీవల రెక్కలు రావడంతో కొనుగోళ్లు దారుణంగా మందగించాయి. అయితే, ధనత్రయోదశి, దీపావళి పండుగల నేపథ్యంలో మార్కెట్లు మళ్లీ జోరందుకుంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సెప్టెంబరులో రూ.40 వేల గరిష్టానికి తాకిన బంగారం ధర ప్రస్తుతం రూ.38 వేల మధ్యలో ఊగిసలాడుతోంది. తాజాగా, బంగారం ధర పది గ్రాములకు 4 శాతం, అంటే రూ.2 వేలు తగ్గడంతో రూ.38 వేలకు దిగొచ్చింది.

దీంతో పండుగకు ముందే వ్యాపారం జోరందుకుంటుందని నగల వర్తకులు భావిస్తున్నారు. మరోవైపు, ధరలు మరింత తగ్గుతాయేమోనని కొనుగోలుదారులు ఎదురుచూస్తున్నారు. దీంతో మహిళలను ఆకట్టుకునేందుకు వ్యాపారులు ప్రమోషనల్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. బంగారం ధరలపై ఎల్‌కేపీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీ అండ్ కరెన్సీ) జతిన్ త్రివేదీ మాట్లాడుతూ.. దీపావళికి ఇంకా వారం రోజులు ఉండడంతో బంగారాన్ని కొనుగోలు చేసేందుకు పెట్టుబడిదారులకు ఇంకా తగినంత సమయం ఉందని అన్నారు. అలాగే, రూ.38 వేల స్థాయి వద్ద బంగారం స్థిరంగా ఉండే అవకాశం ఉందన్నారు.

దేశీయ మార్కెట్లో గత నెలలో రూపాయి మారకం విలువ రూ. 72.60 కనిష్ట స్థాయి తర్వాత ప్రస్తుతం కొంత కోలుకుని రూ. 71.00గా ఉంది. దీంతో దేశీయంగా పసిడి ధరలు రూ.38 వేల వద్ద కదలాడుతున్నాయి. దీపావళి తర్వాత ఇది రూ.39 వేలకు చేరే అవకాశం ఉందని అంటున్నారు. ధన్‌తెరాస్ నేపథ్యంలో ఆభరణాలకు స్పాట్ డిమాండ్ పెరగడంతో ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 పెరిగింది. కాగా, సోమవారం బంగారం ధర పది గ్రాములకు రూ.38,760 వద్ద ముగిసినట్టు హెచ్‌డీ‌ఎఫ్‌సీ సెక్యూరిటీస్‌కు చెందిన తపన్ పటేల్ తెలిపారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *