కర్నూలు: సీఎం జగన్పై మాజీ మంత్రి అఖిలప్రియ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఎత్తివేసి పేద ప్రజల కడుపు కొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియాపై నిరసన తెలుపుతూ.. ఆళ్లగడ్డ పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో టీడీపీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి తహశీల్డారుకు అఖిలప్రియ వినతి పత్రం అందజేశారు. ఏపీలో ఇసుక కొరత తీవ్రరూపం దాల్చడంతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కారు.
