హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బంద్ నేపథ్యంలో హైదరాబాద్లోని నాగోల్ బండ్లగూడ డిపో వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాత్కాలిక సిబ్బందిపై నిరసన కారులు దాడికి దిగారు. బస్సు నడిపించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటపడి చితకబాదడమే కాకుండా రెండు బస్సుల్లో నుంచి టైర్లలో గాలి తీశారు. డీజిల్ పైపులను పీకేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు.
