ఇరాక్: ఇరాక్ దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనకు దిగారు. ఇరాక్ దేశంలో సాగుతున్న ప్రజాందోళనల్లో 34 మంది మరణించగా, మరో 1941 మంది గాయపడ్డారు. దక్షిణ ఇరాక్ లోని పలు నగరాల్లో సాగుతున్న ప్రజల నిరసనలతో ఇరాక్ సర్కారు కర్ఫ్యూ విధించింది. ఇరాక్ లో సాగిన ప్రజాందోళనల్లో 31 మంది నిరసనకారులతోపాటు ముగ్గురు సెక్యూరిటీ అధికారులు మరణించారు. నిరసనకారులకు, సెక్యూరిటీ బలగాలకు మధ్య సాగిన పోరులో 1518 మంది ప్రజలు, 423 మంది ఇరాక్ సెక్యూరిటీ సిబ్బంది గాయపడ్డారని ఇరాక్ మానవహక్కుల కమిషన్ సభ్యుడు అలీ చెప్పారు. మహదీ పాలనలో ఇరాక్ ప్రజలు నిరుద్యోగ సమస్యతో పాటు పలు సమస్యలతో సతమతమవుతున్నారు. పాలకుల అవినీతిపై ప్రజలు ఆందోళనకు దిగారు. నిరసనల నేపథ్యంలో ఇరాక్ ప్రధాని ఆదిల్ అబ్ద్ మహదీ సెక్యూరిటీ బలగాలతో అత్యవసర సమావేశం జరిపారు.
