కావలసిన పదార్థాలు
బూడిద గుమ్మడి – అరకేజీ ముక్క, పచ్చికొబ్బరి తురుము – అరకప్పు, ఆవాలు – ఒకటిన్నర టీ స్పూన్లు, కరివేపాకు – 4 రెబ్బలు, ఉప్పు – రుచికి తగినంత, నూనె – 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి (అర టీ స్పూను నూనెలో వేగించిన) – 5, చింతపండు గుజ్జు – పావు టీ స్పూను.
తయారుచేసే విధానం
(తొక్క, గింజలు తీసిన) బూడిద గుమ్మడి ముక్కలకు కొద్ది నీరు, ఉప్పు చేర్చి ఉడికించాలి. కొబ్బరి తురుము, ఎండుమిర్చి, చింతపండు గుజ్జు, అర టీ స్పూను ఆవాలు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. గుమ్మడి ముక్కలు మెత్తబడ్డాక కొబ్బరి మిశ్రమం వేసి చిన్న సెగమీద 10 నిమిషాలు ఉడికించి ఆవాలు, కరివేపాకు తాలింపు వేసి కలపాలి. ఈ కూర అన్నంతో రుచిగా ఉంటుంది.