Breaking News
Home / Health / కాన్సర్‌కి గుమ్మడికాయతో చెక్…

కాన్సర్‌కి గుమ్మడికాయతో చెక్…

హెల్త్ న్యూస్: గుమ్మడికాయ అనగానే మనం లైట్ తీసుకుంటాం. దిష్టి తియ్యడానికి మాత్రమే అది పనికొస్తుందని అనుకుంటాం. విదేశీయులు సైతం… గుమ్మడికాయల్ని డెకరేషన్ వస్తువుల్లా చూస్తారు. కానీ… గుమ్మడికాయతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా మన శరీరంలో పాంక్రియాస్ (చిన్న పేగుల పక్కన ఉండే అవయవం)కి వచ్చే కాన్సర్ కి చెక్ పెట్టాలంటే గుమ్మడికాయను తినాలి. ముఖ్యంగా శీతాకాలం సమయంలో గుమ్మడికాయలు ఎక్కువగా కాస్తాయి. వీటిలో కెరోటినాయిడ్స్ (బీటా కెరోటిన్, ల్యూటీన్ వంటివి) ఎక్కువగా ఉంటాయి. పసుపు, ఆరెంజ్ కలర్స్‌లో ఉండే గుమ్మడి కాయల్లో ఎక్కువ పోషకాలుంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్… మన కణాలు పాడవకుండా కాపాడతాయి.

గుమ్మడికాయల్లో ఫైబర్, పొటాషియం కూడా ఎక్కువే. అందుకే వీటిని కాన్సర్ పేషెంట్ల ఆహారంలో చేర్చారు. ఐతే… గుమ్మడికాయలు… కాన్సర్ పేషెంట్లు అందరికీ సెట్ కావు. కొంతమంది పేషెంట్లకు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తినబుద్ధి కాదు. విరేచనాల సమస్య ఎదురవుతుంది. అలాంటి వారికి గుమ్మడికాయల ఆహారం పెట్టడం మంచిది కాదు. అది తప్పితే… మిగతా ఎవరికైనా ఇవి చాలా మేలు చేస్తాయి. ఓసారి డాక్టర్ సలహా తీసుకున్నాక వాడితే సరిపోతుంది.

Check Also

క‌రోనాలో కొత్త‌గా ఆరు ల‌క్ష‌ణాలు..

Share this on WhatsAppఇప్ప‌టివ‌ర‌కు జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబును మాత్ర‌మే క‌రోనా ల‌క్ష‌ణాలుగా ప‌రిగ‌ణించాం.. కానీ ఇప్పుడు అది రూటు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *