Breaking News
Home / Film News / పున్ను ఔట్… కన్నీళ్లు పెట్టుకున్న స్నేహితుడు…

పున్ను ఔట్… కన్నీళ్లు పెట్టుకున్న స్నేహితుడు…

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ 3 నుండి పునర్నవి ఎలిమినేట్ అయ్యింది.  ఎలిమినేషన్‌లో పునర్నవి, వరుణ్ సందేశ్‌, మహేశ్‌లు నామినేట్ అయ్యారు. పునర్నవికి తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించారు. నిజానికి మహేశ్ విట్టా ఎలిమినేట్ అవుతాడని వార్తలు వినపడ్డాయి. కానీ చివరకు మహేశ్ ఎలిమినేషన్ నుండి తప్పుకున్నాడు. పునర్నవి వెళ్లిపోవడంతో రాహుల్ సిప్లిగంజ్ వెక్కి వెక్కి ఏడ్చాడు.

హౌస్ నుండి బయటకు వచ్చిన పునర్నవి తన జర్నీకి సంబంధించిన ప్రొమోను చూసి ఎమోషనల్ అయ్యింది. అలాగే మిగిలిన కంటెస్టెంట్స్‌కు మాస్టర్‌గా ఒకర్ని, సేవకుడిగా మరొకరిని ఎంపిక చేస్తూ బిగ్‌బాంబ్ వేయాలని పునర్నవికి నాగార్జున చెప్పగా.. అలీని మాస్టర్‌గా, బాబా భాస్కర్‌ని సేవకుడిగా ఉండాలంటూ పునర్నవి బిగ్‌బాంబ్ వేసింది. అలాగే నవరాత్రుల వేడుకల కారణంగా హౌస్‌మేట్స్ నవరసాలను ప్రదర్శించారు.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *