చండీగఢ్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రభుత్వం దీపావళి బొనంజా ప్రకటించింది. ఉద్యోగులు, పెన్షనర్లకు 3 శాతం కరవు భత్యం (డీఏ) పెంచుతున్నట్టు అమరీందర్ సర్కార్ శనివారంనాడు ప్రకటించింది. ఈ ఏడాది నవంబర్ 1 నుంచి పెంచిన డీఏ వర్తిస్తుందని తెలిపింది.
