Breaking News
Home / National / కేంద్రం పరిశీలనలో ఓటర్ల ప్రక్షాళన అంశం…

కేంద్రం పరిశీలనలో ఓటర్ల ప్రక్షాళన అంశం…

ఢిల్లీ: దేశ పౌరులకు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉండకుండా నిరోధించేందుకు ప్రస్తుత, నూతన ఓటర్ల నుంచి ఆధార్‌ వివరాలు సేకరించాలన్న ఎన్నికల సంఘం ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది. దేశంలో ఒక వ్యక్తికి అనేక ప్రాంతాల్లో ఓటు ఉంటున్నప్పటికీ ప్రస్తుత విధానంలో గుర్తించే అవకాశం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం ఓటుతో ఆధార్‌ను అనుసంధానించే ప్రాజెక్టుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నించగా.. 2015 ఆగస్టులో సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఈ పరిస్థితుల్లో ఆధార్‌ నంబర్లను తీసుకునేందుకు ఈసీకి అనుమతించేలా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలని ఈసీ కేంద్ర న్యాయశాఖకు లేఖ రాసింది.

ఆ లేఖను న్యాయశాఖ నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వెల్లడించాయి. ప్రస్తుత, నూతన ఓటర్ల నుంచి ఆధార్‌ సంఖ్య తీసుకొని ఓట్లుకు అనుసంధానించేలా చట్టాన్ని సవరించాలని ఈసీ కోరింది. నూతన ఓటర్లు దరఖాస్తు చేసుకున్నప్పుడే ఆధార్‌ను తప్పనిసరి చేయాలని కేంద్రానికి సూచించింది. అప్పుడే ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉంటుందని, ఒక వ్యక్తికి అనేక ఓట్లు ఉండకుండా నిరోధించవచ్చని ఈసీ పేర్కొంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *