Breaking News
Home / National / ఒక్కరోజు కూడా అదనంగా జైలులో ఉంచం: అమిత్‌షా

ఒక్కరోజు కూడా అదనంగా జైలులో ఉంచం: అమిత్‌షా

న్యూఢిల్లీ: కశ్మీర్‌‌లో పూర్తిగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. రాజ్యసభలో మంగళవారం నాడు ఆయుధ సవరణ చట్టంపై బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా, కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణ రద్దు అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ అంశంపై రాజ్యసభ ఒక్కసారిగా వేడెక్కింది. దీనిపై హోం మంత్రి అమిత్‌షా స్పందిస్తూ, కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, కాంగ్రెస్‌లో మాత్రం సాధారణ పరిస్థితి తనకు కనిపించడం లేదని చురకలు వేశారు. ఎందుకంటే 370 అధికరణ రద్దు చేస్తే రక్తపాతం తలెత్తుతుందని కాంగ్రెస్ అంచనా వేసిందనీ, అయితే ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండానే సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. కశ్మీర్‌లో రాజకీయ నేతలను ఒక్కరోజు కూడా అదనంగా జైళ్లలో ఉంచాలని తాము అనుకోవడం లేదన్నారు.

కశ్మీర్ ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు సరైన సమయమని భావిస్తుందో అప్పుడే రాజకీయ నేతలు జైలు నుంచి విడుదలవుతారని చెప్పారు. ఫరూక్ అబ్దుల్లా తండ్రిని కాంగ్రెస్ హయాంలో 11 ఏళ్ల పాటు జైలులో ఉంచారని, అయితే తాము మాత్రం అలా చేయమని, ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు నిర్ణయిస్తుందో అప్పుడే నేతలు విడుదలవుతారని చెప్పారు.

అధీర్‌ ఏమనుకుంటున్నారు?
సాధారణ పరిస్థితులు (నార్మలసీ) అంటే కాంగ్రెస్ ఏమనుకుంటోంది? అని అమిత్‌షా ప్రశ్నించారు. 99 శాతం మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, అధీర్‌ రంజన్‌‌కు ఇది సాధారణ పరిస్థితిగా కనిపించడం లేదని అన్నారు. 7 లక్షల మంది ప్రజలకు ఓపీడీ సేవలు అందుతున్నాయని, ప్రతి చోటా 144 సెక్షన్ తొలగించామని చెప్పారు. కానీ, కాంగ్రెస్ విపక్ష నేత అధీర్‌కు సాధారణ పరిస్థితి అంటే రాజకీయ కార్యకలాపాలు ఒక్కటే కనిపిస్తున్నాయని, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మాటేమిటని అమిత్‌షా నిలదీశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *