హైదరాబాద్: కరోనా వైరస్ సహాయనిధిలో భాగంగా ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.5లక్షలు చొప్పున విరాళంగా ప్రకటించింది. గురువారం ఈ విషయాన్ని వెల్లడిస్తూ ట్వీట్ చేసింది. ఈ ప్రమాదకర వైరస్ వ్యాప్తి చెందకుండా భారత్లో ప్రస్తుతం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దేశం మొత్తం లాక్డౌన్ చేశారు. ఇప్పటి వరకు భారత్లో 649 పాజిటివ్ కేసులు నమోదవ్వగా 13 మంది మృతిచెందారు. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు తమవంతు బాధ్యతగా ఆర్థిక సాయం అందజేశారు.