Breaking News
Home / Sports / పీవీ సింధు….50 కోట్లతో భారీ డీల్

పీవీ సింధు….50 కోట్లతో భారీ డీల్

హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో చైనీస్ స్పోర్ట్స్ బ్రాండ్ లీ నింగ్ నాలుగేళ్ల కాలానికి రూ. 50 కోట్లతో భారీ డీల్ కుదుర్చుకుంది. గత నెలలోనే మరో స్టార్ కిదాంబి శ్రీకాంత్‌తో నాలుగేళ్ల కాలానికి రూ. 35 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న లీ నింగ్ ఇప్పుడు సింధుతో ఏకంగా రూ.50 కోట్లకు ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. ఈ డీల్‌లో భాగంగా రూ.40 కోట్లను స్పాన్సర్‌షిప్‌గా పొందనున్న సింధు.. మిగతా పది కోట్ల రూపాయలను క్రీడా సామగ్రి రూపంలో అందుకోనుంది.

సింధుతో తాజాగా కుదుర్చుకున్న డీల్ వరల్డ్ బ్యాడ్మింటన్‌లోనే అతి పెద్దదని భారత్‌లో లీ నింగ్ భాగస్వామి సన్‌లైట్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మహేందర్ కపూర్ పేర్కొన్నారు. పుమాతో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కుదుర్చుకున్న డీల్‌కు ఇది చాలా దగ్గరని తెలిపారు. 2017లో కోహ్లీ పుమాతో రూ.100 కోట్లకు ఒప్పందం చేసుకున్నాడు. ఈ డీల్‌లో భాగంగా కోహ్లీకి ఏడాదికి రూ. 12.5 కోట్లు అందుతాయి.

రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన తర్వాత సింధు స్టార్‌డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒలింపిక్స్‌లో పతకం గెలుచుకున్న తొలి మహిళగా రికార్డులకెక్కిన సింధు గతేడాది ఫోర్బ్స్ జాబితాలో అత్యంత ఎక్కువ మొత్తం అందుకుంటున్న మహిళా క్రీడాకారుల జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది.

లీ నింగ్ సంస్థ సింధుతో ఒప్పందం కుదుర్చుకోవడం ఇది రెండోసారి. 2014-15లో ఏడాదికి రూ.1.25 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, 2016లో సింధు యోనెక్స్‌తో ఏడాదికి రూ.3.5 కోట్లతో మూడేళ్ల కాలానికి డీల్ కుదుర్చుకుంది.

Check Also

ఐపీఎల్ సీజన్-12: ఢిల్లీ టార్గెట్ 169

Share this on WhatsAppన్యూఢిల్లీ: ఐపీఎల్‌-12లో భాగంగా ఫిరోజ్ షా కోట్ల స్టేడియం వేదికగా జరుగుతోన్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ వర్సెస్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *