Breaking News
Home / Sports / గోల్డ్ మెడల్ సాధించలేదని బాధగా లేదు: పీవీ సింధు

గోల్డ్ మెడల్ సాధించలేదని బాధగా లేదు: పీవీ సింధు

జకర్తా: ఆసియా క్రీడల్లో బాడ్మింటన్ ఫైనల్స్‌లోకి ప్రవేశించి సంచలనం సృష్టించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు… మరోసారి రజత పతకంతో సరిపెట్టుకుంది. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌ ఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ షట్లర్ తై జు యింగ్‌పై 13-21, 16-21 తేడాతో పోరాడి ఓడిపోయింది. ఆసియా క్రీడల్లో సింగిల్స్ విభాగంలో ఓ భారత షట్లర్ ఫైనల్స్‌లోకి చేరుకోవడం ఇదే తొలిసారి. ఏషియాడ్‌లో రెండు వ్యక్తిగత పతకాలు గెలుచుకోవడం కూడా ఇదే మొదటిసారి. కాగా సిల్వర్ మెడల్ గెలుచుకున్న తర్వాత పీవీ సింధు మాట్లాడుతూ ‘‘ఓడిపోయే ఎన్నో మ్యాచుల్లో నేను పోరాడి గెలిచాను. కానీ ఈ పోటీ చాలా అద్భుతంగా ఉంది. గోల్డ్ మెడల్ గెలవలేదని నాకు బాధగా లేదు. మెడల్ పోడియంపై ఇద్దరు భారతీయులు ఉండటం ఎంతో గర్వంగా ఉంది’’ అని తెలిపింది. సోమవారం జరిగిన సెమీఫైనల్ పోరులో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కాంస్య పతకం దక్కించుకున్న సంగతి తెలిసిందే. సెమీఫైనల్స్‌లో సైనాను ఓడించి ఫైనల్స్‌కు తై జు యింగ్ ఫైనల్‌లో సింధును ఓడించి గోల్డ్ మెడల్ సాధించింది.

Check Also

ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు…

Share this on WhatsAppపోర్ట్‌ ఆఫ్ స్పెయిన్: 73వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు దేశ ప్రజలకు స్వాతంత్య్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *