Breaking News
Home / States / Andhra Pradesh / Anantapur / క్వారంటైన్‌కు తొమ్మిది మంది కానిస్టేబుళ్లు

క్వారంటైన్‌కు తొమ్మిది మంది కానిస్టేబుళ్లు

అనంతపురం/తాడిపత్రి: రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో అతడితో సంబంధం ఉన్న పది మందిని క్వారంటైన్‌కు పంపారు. వారిలో కానిస్టేబుల్‌ తల్లి, తొమ్మిది మంది కాని స్టేబుళ్లు ఉన్నారు. కొందరిని రావివెంకటాంపల్లి వద్దగల సీవీఆర్‌టీ ఇంజనీరింగ్‌ కళాశాలలోని క్వారంటైన్‌కు, మిగిలిన వారిని వీరాపురం వద్ద గల తాడిపత్రి ఇంజనీరింగ్‌ కళాశాలలోని క్వారంటైన్‌కు తరలించారు. ఈ క్రమంలో రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌లో పనిచేసే పోలీసులంటే ప్రజలు భయపడుతున్నారు. స్టేషన్‌కు వెళ్లాంటే జంకుతున్నారు. అలాగే ముందుజాగ్రత్తగా పట్టణ పోలీ్‌సస్టేషన్‌కు సోడియం హైపోక్లోరైడ్‌ మందును మున్సిపల్‌ సిబ్బంది పిచికారీ చేశారు. పోలీ్‌సస్టేషన్‌ ఆవరణం, లోపలిభాగంలో మందును పిచికారీ చేశారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *