Breaking News
Home / States / Andhra Pradesh / సీఎంపై ఆర్.నారాయణమూర్తి ప్రశంసల వర్షం…

సీఎంపై ఆర్.నారాయణమూర్తి ప్రశంసల వర్షం…

పశ్చిమగోదావరి : నేడు పాలకొల్లులో సినీ నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ‘ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మనస్పూర్తిగా అభినందిస్తున్నా. జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపుల్ని ప్రాత్సహించలేదు. ఎవరైనా నాయకుడు పార్టీ మారాలని చూస్తే ఆ పార్టీకి, పదవికీ రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. జనాభా లెక్కల ప్రకారం బీసీలకు 54 శాతం రిజర్వేషషన్లు కల్పించిన ఏకైక నాయకుడు సీఎం జగన్‌ అని ప్రశంసలు వర్షం కురిపించారు. మార్కెట్‌లో ప్రజాస్వామ్యం అనే సినిమాను మీరందరూ చూడండి, ఆదరించండి. చూపించండి.

భారత దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ఓటుకు నోటు, రూ.100 కోట్లు పెడితే ఎమ్మెల్యే, 200 కోట్లు పెడితే ఎంపీ టికెట్. ప్రజాస్వామ్యం ధన స్వామ్యం అయిపోయింది. ప్రజాస్వామ్యం సంతలో సరుకైపోయింది. ప్రజాస్వామ్యన్ని పరిరక్షించడం ద్వారా మన అందరి బతుకులు బాగుంటాయి అనేది ఈ చిత్రం.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *