Breaking News
Home / Featured / బాంబ్ పేల్చిన లారెన్స్.. గౌరవం లేదంటూ వాకౌట్

బాంబ్ పేల్చిన లారెన్స్.. గౌరవం లేదంటూ వాకౌట్

న‌టుడు, ద‌ర్శ‌కుడు రాఘ‌వ లారెన్స్ రీసెంట్‌గా బాలీవుడ్‌లో డైరెక్ష‌న్ స్టార్ట్ చేశాడు. తెలుగు, త‌మిళంలో త‌న న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం `కాంచ‌న‌`. ఈ హార‌ర్ కామెడీ ద‌క్షిణాదిన సెన్సేష‌న‌ల్ హిట్ సాధించింది. అక్ష‌య్ కుమార్ హీరోగా ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో `ల‌క్ష్మీ బాంబ్‌` పేరుతో రీమేక్ చేయాల‌నుకున్నారు. అంతా ఓకే అయ్యింది. షూటింగ్ కూడా రీసెంట్‌గా షురూ అయ్యింది. శ‌నివారం ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ కూడా రిలీజైంది. ఇది పెద్ద వివాదానికి దారి తీసింది. ద‌ర్శ‌కుడు లారెన్స్‌ను అడ‌గ‌కుండా సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశార‌ట‌. ఈ విష‌యంపై లారెన్స్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు.

త‌మిళంలో ఓ నానుడి ఉంది. “గౌర‌వం లేని ఇంట్లో అడుగు పెట్ట‌కూడ‌ద‌ని” అంటుంటారు. ఈ ప్ర‌పంచంలో పేరు, ప్ర‌తిష్ట‌ల కంటే వ్య‌క్తిగ‌త గౌర‌వం చాలా ముఖ్య‌మైంది. కావున ల‌క్ష్మీ బాంబ్ ప్రాజెక్ట్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్నాను. ఒక కార‌ణ‌మ‌ని చెప్ప‌లేను, చాలా కార‌ణాలున్నాయి. అందులో ఒక ఉదాహ‌ర‌ణ‌.. సినిమా ఫ‌స్ట్ లుక్‌ను కనీసం నా అవ‌గాహ‌న లేకుండా విడుద‌ల చేశారు. నాతో డిస్క‌ష‌న్ కూడా చేయ‌లేదు. మూడో వ్య‌క్తి ద్వారా నాకు అస‌లు విష‌యం తెలిసింది. ఇత‌రుల నుండి త‌న సినిమాకు సంబంధించిన విష‌యాల‌ను తెలుసుకునే ప‌రిస్థితి ద‌ర్శ‌కుడికి రావ‌డం చాలా బాధాక‌రం. నేను డిసప్పాయింట్ అయ్యాను. ఓ క్రియేట‌ర్‌గా నాకు కూడా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ న‌చ్చ‌లేదు. ఇది మ‌రో డైరెక్ట‌ర్‌కి జ‌ర‌గ‌లేదు. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అగ్రిమెంట్ చేయ‌లేదు. ప్రొఫెష‌న‌ల్‌గా లేని ఈ సినిమాను నేను చేయ‌లేను. నేను అక్ష‌య్‌కుమార్‌గారిని వ్య‌క్తిగ‌తంగా బాగా ఇష్ట‌ప‌డ‌తాను. కాబ‌ట్టి స్క్రిప్ట్‌ను ఆయ‌న‌కు ఇచ్చేస్తాను. వారి ఇష్టానుసారం మ‌రో డైరెక్ట‌ర్‌ను నియ‌మించుకోవ‌చ్చు. అక్ష‌య్ కుమార్‌గారికి స్క్రిప్ట్ అందించి మంచి పద్ధ‌తిలో బ‌య‌ట‌కు వ‌చ్చేస్తాను. ఎంటైర యూనిట్‌కు అభినంద‌న‌లు. సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు రాఘ‌వ లారెన్స్‌.

Check Also

టాలీవుడ్‌లో సరికొత్త రికార్డు సృష్టించిన పాట….

Share this on WhatsAppహైదరాబాద్‌: ‘స్టైలిష్‌ స్టార్‌’ అల్లు అర్జున్‌ ‘సామజవరగమనా..’ పాట యూట్యూబ్‌లో అస్సలు ఆగడం లేదు. టాలీవుడ్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *