Breaking News
Home / Lifestyle / Recipes / రాగి వడ తయారీ విధానం మీకోసం….

రాగి వడ తయారీ విధానం మీకోసం….

వంటలు:

కావలసిన పదార్థాలు : రాగి పిండి – 80 గ్రా., శనగ పప్పు – 35 గ్రా., కారం పొడి – 5 గ్రా., ఉప్పు – రుచికి సరిపడా, ఉల్లిపాయలు – 10 గ్రా., పచ్చిమిర్చి – 5 గ్రా., అల్లం – 10 గ్రా., గరంమసాల పొడి – చిటికెడు, కరివేపాకు – 5 గ్రా., కొత్తిమీర – 5 గ్రా., పుదీనా – 10 గ్రా., జీలకర్ర – 5 గ్రా., నూనె – 200 గ్రా.

తయారీ విధానం : శనగపప్పును నానబెట్టి, మరీ మెత్తగా కాకుండా రుబ్బి పిండిలో కలపాలి. తర్వాత అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కారం, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు వేసి ముద్దగా కలిపి ఉంచుకోవాలి. పాన్ లో నూనె కాగిన తరువాత పిండిని కొంచెం తీసుకొని వడల్లాగా చేసి ఎర్రగా వేయించాలి.

Check Also

క్యాబేజీ పరోటా

Share this on WhatsAppకావలసిన పదార్థాలు : క్యాబేజీ- అర కిలో, అల్లం- తగినంత, పచ్చిమిరపకాయలు- 6, జీలకర్ర- తగినంత, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *