Breaking News
Home / National / ద్విశతకంతో కదం తొక్కిన కోహ్లీ….

ద్విశతకంతో కదం తొక్కిన కోహ్లీ….

పూణె: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (200; 295 బంతుల్లో 28X4) ద్విశతకంతో కదం తొక్కాడు. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 273/3తో శుక్రవారం రెండో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రహానె(59; 168బంతుల్లో 8×4)తో కలిసి నాలుగో వికెట్‌కు 178 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం జోడించాడు. ఈ క్రమంలో రహానె అర్ధశతకం తర్వాత మహారాజ్‌ బౌలింగ్‌లో కీపర్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా(26; 66 బంతుల్లో 2×4)తో కలిసిన కోహ్లీ మరో 107 పరుగుల విలువైన భాగస్వామ్యం నిర్మించాడు. ఈ ద్విశతకంతో కోహ్లీ ఏడు వేల పరుగుల మైలురాయిని కూడా అందుకోవడం విశేషం. దీంతో భారత్‌ భారీ స్కోర్‌ దిశగా పయనిస్తుంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *