సూరత్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నేడు పరువునష్టం కేసులో సూరత్‌లోని కోర్టులో హాజరయ్యారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై బీజేసీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ ఆయనపై పరువునష్టం దావా వేశారు. దొంగలందరూ తమ పేర్లకు మోదీ అని ఎందుకు తగిలించుకున్నారో అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై పెద్దయెత్తున నిరసన వ్యక్తమైంది.
