Breaking News
Home / National / ఎనీ టైమ్…ఎనీ ప్లేస్… సవాల్…!

ఎనీ టైమ్…ఎనీ ప్లేస్… సవాల్…!

న్యూఢిల్లీ: ‘రాఫెల్’ వివాదంపై మోదీ సర్కార్‌ను గుక్క తిప్పుకోనీయకుండా చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈసారి నేరుగా మోదీకి సవాలు విసిరారు. ఫ్రాన్స్‌తో రాఫెల్ డీల్ వివాదం, సీబీఐలో కల్లోలంపై కేవలం 15 నిమిషాల పాటు చర్చకు రావాలని ప్రధానికి రాహుల్ సవాల్ విసిరారు. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో ఎన్నికల ప్రచారం సాగిస్తున్న రాహుల్ మీడియాతో మాట్లాడుతూ, తాను లేవనెత్తిన ప్రశ్నలపై ప్రధాని నోరు మెదిపే పరిస్థితిలో లేరని అన్నారు. ‘నేను మోదీజీని సవాలు చేస్తున్నాను. ఎక్కడైనా, ఏ సమయంలోనైనా, వేదిక ఏదైనా సరే….కేవలం 15 నిమిషాలు నాతో డిబేట్ చేయడానికి రండి. అనిల్ అంబానీ, హాల్, ఫ్రెంచ్ అధ్యక్షుడి ప్రకటన, రాఫెల్ జెట్ల ధరలపై నేను మాట్లాడతాను. ప్రధానే అంతా చూసుకున్నట్టు రక్షణ శాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. ఎలాంటి నిబంధనలు ప్రధాని పాటించలేదు. సీబీఐ డెరెక్టర్‌ని తెల్లవారుజామున 2 గంటలకు తొలగించారు. నేను అడిగే ఏ ప్రశ్నలకూ ఆయన (మోదీ) సమాధానాలు చెప్పలేరు’ అని రాహుల్ పేర్కొన్నారు. అంతకుముందు, ఛత్తీస్‌గఢ్‌లో చేసిన ప్రసంగంలోనూ, మోదీ సర్కార్ బడా పారిశ్రామికవేత్తలకు కొమ్ముకాస్తున్నారంటూ రాహుల్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పది రోజుల్లో రైతుల రుణాలు మాఫీ చేస్తామని, అందుకు అవసరమైన డబ్బులు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, అనిల్ అంబానీ నుంచి రాబడతామని కూడా ఆయన కరాఖండిగా చెప్పారు. ‘మోదీజీ…పది రోజులు లెక్కపెట్టుకోండి. గడువులోగా రైతుల రుణాలు మాఫీ చేసి తీరుతాం’ అంటూ సవాల్ విసిరారు.

Check Also

నేడు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాక

Share this on WhatsAppవిజయవాడ: భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆదివారం రానున్న నేపథ్యంలో పోలీస్‌ అధికారులు ట్రయల్‌ రన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *