Breaking News
Home / National / అవినీతిపై పోరాటం అంటూనే మోదీ లూటీ : రాహుల్

అవినీతిపై పోరాటం అంటూనే మోదీ లూటీ : రాహుల్

న్యూఢిల్లీ: రాఫెల్ ఒప్పందంపై మోదీ సర్కార్‌పై అవిశ్రాంత పోరాటం సాగిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాజాగా మరోసారి నిప్పులు చెరిగారు. ఓ జాతీయ పత్రిక కథనాన్ని రాహుల్ ఉటంకిస్తూ, వివాదాస్పద ఫైటర్ జెట్ డీల్ నుంచి అవినీతి వ్యతిరేక జరిమానాలకు సంబంధించి కీలక నిబంధనలను మోదీ రద్దు చేయడం ద్వారా ఈ ఒప్పందంలో లూటీకి మోదీ మార్గం సుగమం చేశారని ఆరోపించారు.

‘ప్రతి డిఫెన్స్ డీల్‌కూ అవినీతి నిరోధక క్లాజ్ ఉంటుంది. అవినీతి నిరోధక క్లాజ్‌ను ప్రధాని తొలగించారని ‘ది హిందూ’ కథనం ప్రచురించింది. దీంతో దోపిడీకి మోదీ మార్గం సుగమం చేశారనే విషయం స్పష్టమవుతోంది’ అని రాహుల్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా ప్రజా విశ్వాసం కోల్పోయారని విమర్శించారు.

ఏపీ ప్రజలకు అండగా ఉంటా…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు రాహుల్ సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున తానుంటానని ఆయన అన్నారు. మోదీపై మండిపడుతూ ‘ఆయనేం ప్రధాని? ఆంధ్రప్రదేశ్ ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడలేదు. పైగా ఎక్కడికి వెళ్లినా పచ్చి అబద్ధాలాడతారు. ఆయనకు ఇంకెలాంటి విశ్వసనీయత లేదు’ అని అన్నారు.

Check Also

రాజకీయాలకతీతంగా దాడిని ఖండించాం: రామ్మోహన్‌నాయుడు

Share this on WhatsAppన్యూఢిల్లీ: పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి గురించి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ వివరించారని టీడీపీ ఎంపీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *