Breaking News
Home / National / ఉద్యోగాలిస్తాం, రూ.3వేల భృతి ఇస్తాం: రాహుల్ గాంధీ

ఉద్యోగాలిస్తాం, రూ.3వేల భృతి ఇస్తాం: రాహుల్ గాంధీ

నిర్మల్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని చెప్పిన మాట నిలబెట్టుకుంటామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. నిర్మల్ జిల్లా భైంసాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదివాసీల భూములు వెనక్కి ఇస్తామని రాహుల్ గాంధీ అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జీఎస్టీపై రాహుల్ నిప్పులు చెరిగారు. జీఎస్టీ తీసుకొచ్చి చిన్న వ్యాపారుల జీవితాలు ఛిద్రం చేశారని ఆయన విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్‌, ఢిల్లీలో మోదీ ఓడిపోతారని జోస్యం చెప్పారు. ఇక్కడ (తెలంగాణ), అక్కడా (కేంద్రం) వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వాలేనని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు.

Check Also

ఎంజీ హెక్టార్ కారు విడుదల

Share this on WhatsAppన్యూఢిల్లీ: ఎంజీ మోటార్స్ తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో మరో కారును మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *