మహారాష్ట్ర : మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల శాసనసభల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రచారం చేయనున్నారు. దసరా పండుగ తరువాత రాహుల్ గాంధీ ఆ రెండు రాష్ట్రాలలోనూ ప్రచారం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. హర్యానా, మహారాష్ట్రలలో ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకూ రాహుల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆ వర్గాలు తెలిపాయి.
