Breaking News
Home / National / రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు…

రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు…

ఢిల్లీ: పండగ సీజన్‌ కావడంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ 2,500 అదనపు సర్వీసులను నడుపుతోందని అధికారులు తెలిపారు. దీని కోసం 200 ప్రత్యేక రైళ్లను కేటాయించామన్నారు. ఈ అదనపు సర్వీసులు క్రిస్మస్‌ వరకు కొనసాగుతాయన్నారు. అలాగే రద్దీగా ఉండే పలు మార్గాల్లో ప్రస్తుతం ఉన్న సర్వీసులకు అదనపు బోగీలను జతచేసే ఏర్పాటు కూడా చేశామన్నారు. ముఖ్యంగా ఢిల్లీ-పాట్నా, ఢిల్లీ-కోల్‌కతా, ఢిల్లీ-ముంబయి, హావ్‌డా-కతిహార్‌, హరిద్వార్‌-జబల్‌పూర్‌ లాంటి రద్దీ మార్గాల్లో ఈ రైళ్లు నడుస్తాయన్నారు.

దక్షిణాదిలోని ముఖ్యపట్టణాలకు కూడా అదనపు సర్వీసులు ఉంటాయని తెలిపారు. రైల్వే స్టేషన్లలో రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక సిబ్బందిని మోహరించామన్నారు. లెవర్‌ క్రాసింగ్‌ల వద్ద కూడా అదనపు సిబ్బందిని ఉంచుతున్నామని తెలిపారు. స్టేషన్లలో అదనపు వెలుతురు కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. ప్రయాణికుల సహాయార్థం ప్రత్యేక సర్వీసు కౌంటర్లు నెలకొల్పామన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *