విశాఖ: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్లు భారీ స్కోర్‌పై కన్నేశారు. రోహిత్‌శర్మ (115; 174 బంతుల్లో 12×4, 5×6) శతకంతో చెలరేగుతుండగా మయాంక్ అగర్వాల్ (84; 183 బంతుల్లో 11×4, 2×6) చక్కటి సహకారం అందిస్తున్నాడు. అతడూ శతకం వైపు పరుగులు తీస్తున్నాడు. ముఖ్యంగా రోహిత్ స్పిన్నర్లను టార్గెట్ చేసినట్లు కనిపిస్తున్నాడు. దీంతో టీ విరామానికి జట్టు స్కోర్ 59.1 ఓవర్లలో 202కి చేరింది. తొలి రోజు ఇంకా 30 ఓవర్ల ఆట మిగిలి ఉండగా స్టేడియంపై నల్లమబ్బులు కమ్ముకున్నాయి. ప్రస్తుతం అక్కడ వర్షం పడుతుండడంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది.
