Breaking News
Home / States / భారీవర్షంతో పలుచోట్ల ట్రాఫిక్‌ జాం…

భారీవర్షంతో పలుచోట్ల ట్రాఫిక్‌ జాం…

హైదరాబాద్: నగరంలో కురిసిన కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మూడు రోజులుగా సాయంత్రం కురుస్తున్న వర్షాలతో నగరవాసులు వణికిపోతున్నారు. శనివారం సాయంత్రం క్యూములోనింబస్‌ మేఘాలతో పలు ప్రాంతాల్లో కుండపోత వాన కురిసింది. గంట పాటు కురిసిన భారీవర్షంతో రహదారులు చెరువులను తలపించాయి. రోడ్లపై భారీగా వరదనీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. సికింద్రాబాద్‌, అల్వాల్‌, నేరేడ్‌మెట్‌, మలక్‌పేట్‌, సైదాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వరద నీరు రహదారులను ముంచేయడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్‌ జాం అయింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *