Breaking News
Home / States / Andhra Pradesh / కోస్తా, సీమలకు వర్షసూచన

కోస్తా, సీమలకు వర్షసూచన

విశాఖపట్నం: శ్రీలంక తీరం సమీపంలోని నైరుతి బంగాళాఖాతం నుంచి కోస్తా వరకు ద్రోణి కొనసాగుతోంది. దీంతో సముద్రం మీదుగా తూర్పుగాలులు వీస్తుండడంతో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారాయి. రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఉరుములతో వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల్లో కూడా కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *