విశాఖపట్నం: కొమరిన్, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దాని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు, ఒకటి, రెండుచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం రాగల 24 గంటల్లో బలపడి అరేబియా సముద్రం పరిసరాల్లో అల్పపీడనం తదనంతరం వాయుగండంగా మారే అవకాశం వుందని పేర్కొంది. అయితే దాని ప్రభావం రాష్ట్రంపై వుండకపోవచ్చునని వెల్లడించింది.
