Breaking News
Home / States / Andhra Pradesh / వాయుగండంగా బలపడనున్న అల్పపీడనం

వాయుగండంగా బలపడనున్న అల్పపీడనం

విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో వున్న తీవ్ర అల్పపీడనం మరో 48 గంటల్లో వాయుగండంగా బలపడే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఒకటి, రెండుచోట్ల భారీవర్షాలు, కుంభవృష్టికి అవకాశం వుందని పేర్కొంది. తీవ్ర అల్పపీడనం ఉత్తర ఈశాన్య దిశగా పయనించి ఆంధ్ర తీరం వైపు పయనిస్తుందని వెల్లడించింది. ఈ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా వుంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *