Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / నేడూ రేపు వర్షాలే

నేడూ రేపు వర్షాలే

ఈశాన్య మధ్యప్రదేశ్‌ నుంచి ఉత్తర మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఉత్తరమధ్య కర్ణాటక పరిసరాల్లోనూ ఉపరితల ఆవర్తనం నెలకొంది. వీటి ప్రభావంతో ఆదివారం శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు పడ్డాయి. జి.సిగడంలో 90.5, ముమ్మడివరంలో 63, తలుపులలో 61.5, పిడుగురాళ్ల లో 59.75, చల్లపల్లిలో 49.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. సోమ, మంగళవారాల్లో ఉత్తరాంధ్రలో తేలికపాటి వర్షాలు, దక్షిణకోస్తాలో ఓ మోస్తరు వర్షా లు, రాయలసీమలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Check Also

గుంటూరు జిల్లాలో నేటి నుంచి నిబంధనలు మార్పు..

Share this on WhatsAppఏపీని కరోనా వణికిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో జనాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *