కోల్కత్తా: శారదా చిట్ఫండ్ స్కాం కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ కుమార్కు కాస్తంత ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు కోల్కత్తా హైకోర్టు మంగళవారం ముందస్తు బెయిలు మంజూరు చేసింది. శారదా చిట్ఫండ్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజీవ్ కుమార్ తరఫున ఆయన భార్య ముందస్తు బెయిలు కోసం దరఖాస్తు చేశారు. తన భర్తకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె కోల్కతా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకొచ్చింది. జస్టిస్ మున్షీ, జస్టిస్ సుభాషిస్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం రాజీవ్ కుమార్కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది.
