
హిమాలయాల బాట
రజనీ నటిస్తున్న చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసిన తరువాత హిమాలయాలకు వెళ్లడం రజనీకాంత్‌కు ఆనవాయితీగా మారింది. హిమాలయాల్లో కనీసం 10 రోజులకు తగ్గకుండా ఆయన గడిపి తిరిగొస్తారు. తరువాత కొత్త చిత్రానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదే ఆనవాయితీని తాజాగా మరోసారి కొనసాగించారు. అవును దర్భార్ చిత్ర షూటింగ్ పూర్తి కావడంతో రజనీకాంత్ ఆదివారం ఉదయం చెన్నై విమానాశ్రయం నుంచి హిమాలయాలకు బయలు దేరారు. ఆయన విమానం ద్వారా ఉత్తరాఖాండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌కు చేరుకుని, అక్కడ నుంచి కారులో పయనించి పలు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారని తెలిసింది. కేధార్నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్య స్టలాలను దర్శించుకుంటారు. అక్కడి నుంచి హిమాలయాలకు వెళ్లాతారని సమాచారం. హిమాలయాల్లో ఆయన దైవంగా భావించే బాబా గృహలో ధ్యానం చేసి, ఆక్కడ పలు ప్రాంతాలను సందర్శించి చెన్నైకి తిరిగొస్తారు. తరువాత దర్భార్ చిత్ర డబ్బింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్ర షూటింగ్లో పాల్గొంటారని తెలిసింది. రజనీకాంత్ రాజకీయరంగప్రవేశం మరింత జాప్యం జరిగే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఏదేమైనా రజనీ రాజకీయం పెద్ద చర్చనీయాంశంగా మారిందన్న నిజం.