Breaking News
Home / National / వాయుసేన చీఫ్‌ మార్షల్‌గా భదూరియా…

వాయుసేన చీఫ్‌ మార్షల్‌గా భదూరియా…

ఢిల్లీ: వైమానిక దళ నూతన అధిపతిగా రాకేశ్‌ కుమార్‌ సింగ్‌ భదూరియా బాధ్యతలు చేపట్టి 26వ వైమానిక దళ చీఫ్‌ మార్షల్‌గా పనిచేయనున్నారు. ఇంతకు ముందున్న చీఫ్‌ మార్షల్‌ బీఎస్‌ ధనోవా పదవీకాలం నేటితో ముగియడంతో భదూరియా బాధ్యతలు చేపట్టారు. 1980 జూన్‌లో ఈయన భారత వాయుసేనలో చేరగా 40ఏళ్ల కెరీర్‌లో ఎన్నో కీలక బాధ్యతలను నిర్వర్తించారు. ఈయన ఇప్పటివరకు 26 రకాల యుద్ధ విమానాలను నడిపారు. 4,250 గంటల పాటు యుద్ధ విమానాలు నడిపిన అనుభవం కూడా ఉంది. ఇంతకు ముందు ఆయన వాయుసేన వైస్‌ చీఫ్‌గా పనిచేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *