Breaking News
Home / Film News / ‘‘తందానే తందానే’’ అంటూ సాగిపోనున్న చెర్రీ….

‘‘తందానే తందానే’’ అంటూ సాగిపోనున్న చెర్రీ….

బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘వినయ విధేయ రామ’. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బోయపాటి మార్క్‌లో రాబోతున్న ఈ సినిమాలో చెర్రీ సరసన కియారా అద్వాని ఆడిపాడుతోంది. చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాణ బాధ్యతలు చేపట్టగా.. దేవి శ్రీ బాణీలు కడుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

కాగా తాజాగా చిత్రంలోని ఫస్ట్ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. దేవి శ్రీ బాణీల్లో ‘‘తందానే తందానే’’ అంటూ సాగిపోనున్న ఈ ఫ్యామిలీ సాంగ్‌ ప్రేక్షక లోకాన్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. 4 నిమిషాల 20 సెకనుల నిడివితో కూడిన ఈ పాటలో చిత్ర షూటింగ్ సమయంలోని పలు సన్నివేశాలు చూపించారు. తెలుపు దుస్తుల్లో వినయం, విధేయత అన్నీ కలగలిపిన లక్షణాలున్న అబ్బాయిగా చెర్రీ లుక్ మెగా అభిమానులకు కన్నుల పండగ అవుతోంది. భారీ అంచనాల నడుమ సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Check Also

ఆమె లోటు ఎవరు తీర్చలేనిది …

Share this on WhatsAppహైదరాబాద్: చలన చిత్ర పరిశ్రమకు ఈ రోజు చాలా దురదృష్టకరమైన రోజని సినీ డైరక్టర్ కె. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *