Breaking News
Home / Film News / రామ్ కొత్త సినిమా లాంచ్…

రామ్ కొత్త సినిమా లాంచ్…

ఫిల్మ్ న్యూస్: రామ్ తన తదుపరి చిత్రానికి దర్శకుడిగా కిషోర్ తిరుమలనే ఖరారు చేసుకున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లోని సినిమాకి ‘రెడ్’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్నారు. స్రవంతి మూవీస్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా కొంతసేపటి కితమే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. నవంబర్ 16వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఒక కథానాయికగా మాళవిక శర్మను .. మరో కథానాయికగా నివేద పేతురాజ్ ను ఎంపిక చేసుకున్నట్టుగా సమాచారం. డిఫరెంట్ లుక్ తో రామ్ కనిపించనున్న ఈ సినిమాకి, మణిశర్మ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. కెరియర్ పరంగా రామ్ కి ‘రెడ్’ 18వ సినిమాకాగా .. ఆయన కిషోర్ తిరుమలతో చేస్తున్న 3వ సినిమా ఇది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *