Breaking News
Home / States / ఇంకా తెలియరాని రమ్య ఆచూకీ….

ఇంకా తెలియరాని రమ్య ఆచూకీ….

మంచిర్యాల: తూర్పుగోదావరి జిల్లా గోదావరిలో నీట మునిగిన పర్యాటక పడవను అధికారులు 38 రోజుల తర్వాత వెలికితీశారు. ఇందులో కొన్ని మృతదేహాలు లభ్యమయ్యాయి. జిల్లాలోని హాజీపూర్‌ మండలం నంనూరు గ్రామ నివాసి కారుకూరి రమ్య మృతదేహం ఇంకా గుర్తించలేదు. పడవను వెలికి తీశారనే సమాచారం అందడంతో రమ్య ఆచూకీ దొరుకుతుందనే ఆశతో ఆమె తల్లి భూమక్క, తండ్రి సుదర్శన్‌, తమ్ముడు రఘు ఇతర కుటుంబసభ్యులు సంఘటన స్థలానికి తరలివెళ్లారు. పడవలో లభ్యమైన మృతదేహాల్లో రమ్యను ఇంకా గుర్తించలేదు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *