Breaking News
Home / Crime / ట్రాన్స్ జెండర్ పై సామూహిక అత్యాచారం…

ట్రాన్స్ జెండర్ పై సామూహిక అత్యాచారం…

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ట్రాన్స్‌జెండర్‌ను కిడ్నాప్‌ చేసి ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన కామలి నగరంలోని ధూప్‌సారి గ్రామంలో చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామలి నగరానికి చెందిన నలుగురు ట్రాన్స్‌జెంటర్‌ ఓ ఈవెంట్‌ కోసం ధూప్‌సారి గ్రామానికి వెళ్లారు. అక్కడి కార్యక్రమం ముంగించుకొని అర్థరాత్రి స్వగ్రామాలకు బయలుదేరారు. మార్గమధ్యలో ఐదుగురు దుండగులు వీరిని అడ్డుకున్నారు. వారితో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా.. ఓ ట్రాన్స్‌జెండర్‌ని కిడ్నాప్‌ చేసి సమీపంలోని ఫామ్‌హౌస్ కి తీసుకెళ్లారు.

అనంతరం ఐదుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు మూడు గంటల పాటు ఆ ట్రాన్స్‌జెండర్‌కు నరకం చూపించారు. అనంతరం ఆమెను సహివాల్‌ నగరంలో విడిచిపెట్టి పారిపోయారు. ఓ స్నేహితురాలి ద్వారా ఇంటికి చేరుకున్న ఆమె.. మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకోలేదు. దీంతో ఆమె సహివాల్‌ డీపీఓకు ఫిర్యాదు చేశారు. డీపీఓ సూచన మేరకు కేసు నమోదు చేసుకున్న హరప్పా పోలీసులు.. నిందితులను అరెస్ట్‌ చేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *