Breaking News
Home / Featured / హైదరాబాద్‌లో అరుదైన రాబందుకూన

హైదరాబాద్‌లో అరుదైన రాబందుకూన

  • 20 ఏళ్లలో కనిపించడం ఇదే మొదటిసారి
  • ఎండ వేడిమితో అస్వస్థత
  • చికిత్స అందించిన జూపార్కు అధికారులు
హైదరాబాద్‌ సిటీ: అంతరించిపోతున్న పక్షుల జాబితాలో ఉన్న అరుదైన రాబందు ఆసిఫ్‌నగర్‌ ప్రాంతంలో ప్రత్యక్షమైంది. గత 20 ఏళ్లలో తెల్లగూని రాబందు కూన కనిపించడం ఇదే తొలిసారి. తీవ్రమైన ఎండవేడిమి కారణంగా నీరసించిపోయి పడిఉన్న రాబందును నెహ్రూ జులాజికల్‌ పార్కుకు తరలించి సంరక్షిస్తున్నారు. శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఆసిఫ్‌నగర్‌ క్రాస్‌ రోడ్స్‌లో రాబందు కనిపించడంతో స్థానిక యువకులు అబ్దుల్‌ నయూం, అబ్దుల్‌ అజీమ్‌ అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు అది అంతరించిపోతున్న జాబితాలోని రాబందుగా గుర్తించి, జూపార్కులోని పశు వైద్యశాలకు తరలించారు. ఎండవేడిమి కారణంగా శరీరంలో నీటి శాతం పడిపోగా, ఎలక్ట్రోల్ పౌడర్‌ను తాగించడంతో కోలుకుంది. జూపార్కు అధికారులు రాబందు కూనను ప్రత్యేకంగా సంరక్షిస్తున్నారు. ఆసి్‌ఫనగర్‌ పరిసరాల్లో రాబందు కూన గూడును ఉండవచ్చని భావిస్తున్న అధికారులు దాన్ని వెతికే ప్రయత్నాలు ప్రారంభించారు.
రూ. కోట్లరూపాయలు ఇస్తామన్న పార్సీలు
పార్సీలు ఎవరైనా మరణిస్తే తమ ఆచారం ప్రకారం మృతదేహాన్ని ఎత్తయిన ప్రదేశంలో ఉంచుతారు. ఆ సమయంలో రాబందులు వచ్చి ఆ శరీరాన్ని తినాలని వారు కోరుకుంటారు. ప్రస్థుతం దేశవ్యాప్తంగా ఈ రాబందులు దాదాపు అంతరించే దశలో ఉన్నాయి. దీంతో వీటి సంఖ్యను పెంచాలని పార్శీలు కోరుతున్నారు. ఇలా చేస్తే ఎన్ని రూ.కోట్లయినా ఇస్తామని గతంలోనే పార్సీలు ప్రకటించారు. ఇదే విషయాన్ని అటవీశాఖ వర్గాలు గుర్తుచేస్తున్నాయి.

Check Also

హైదరాబాద్ బోరబండలో దారుణం…

Share this on WhatsApp  హైదరాబాద్: బోరబండలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భూతవైద్యం పేరుతో ఓ దొంగ బాబా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *